DTH, Cable TV వీటిలో ఏది బెస్ట్... ప్రస్తుత పరిస్థితుల్లో ఏది తీసుకుంటే బెటర్...

భారీగా పెరిగిన కేబుల్ టీవీ ధరలు... ప్రకటనల్లో చూపించిన దానికీ కేబుల్ ఆపరేటర్లు చెప్పే ధరలకు పొంతన లేక అయోమయానికి గురవుతున్న సామాన్యులు.. డీటీహెచ్‌ల ప్యాక్‌ల ధరల గురించి అర్థం కాక తికమక... ట్రాయ్ కొత్త నిబంధనల వల్ల టీవీ ప్రేక్షకులకు కొత్త చిక్కులు...

DTH బెటర్ ఆ..., Cable TV బెటర్ ఆ... ఇప్పుడు అందరికీ తొలిచివేస్తున్న ప్రశ్న ఇది. ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరా అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నిబంధనల కారణంగా సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు. రూ. 130 చెల్లిస్తే 100 ఫ్రీ ఛానెల్స్ వస్తాయని... మిగిలిన పే ఛానెల్స్ కావాలంటే ఏ ఏ ఛానెల్స్ చూడాలనుకుంటున్నారో వాటిని ఎంచుకుని, వాటికి ఫిక్స్ చేసిన ఖరీదు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలు కూడా విడుదల చేశారు. జీ నెట్‌వర్క్, స్టార్ నెట్‌‌వర్క్, సన్ నెట్‌వర్క్ ఇలా... ఏ ఛానెల్స్‌కు సంబంధించి వాళ్లు తమ ఛానెల్స్ చూడాలంటే ఎంత చెల్లించాల్సి ఉంటుందో చెబుతూ ప్రకటనలు విడుదల చేశాయి. అయితే ప్రకటనల్లో చూపించిన దానికీ, కేబుల్ ఆపరేటర్లు చెబుతున్నదానికీ చాలా తేడా ఉంటుంది. దీంతో ఇన్ని రోజులు ప్రశాంతంగా టీవీ చూసిన ప్రేక్షకులు... ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
ప్రకటనల్లో చెప్పినట్టుగానే రూ. 130 చెల్లిస్తే 100 ఫ్రీ ఛానెల్స్ చూడొచ్చు. అయితే ఈ మొత్తం GST లేకుండా... 18 శాతం జీఎస్టీ కలుపుకుని రూ.153.40 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా అదనంగా తీసుకునే ఒక్కో ఛానెల్‌కు ఆ ఛానెల్ ధరతో పాటు మరో రూ.20 లు ప్యాక్ వాల్యూ కింద చెల్లించాలి.
ఉదాహరణకు...
కేబుల్ టీవీ ప్యాక్స్ ఇలా...
వంద ఉచిత ఛానెల్స్‌కు రూ. 130 + జెమినీ టీవీ ఒక్క ఛానెల్ చూడాలంటే దాని ఖరీదు రూ.19+ రూ.20 ప్యాక్ ఖరీదు... మొత్తం రూ.169+ 30.42 (18 శాతం GST)... మొత్తం 101 ఛానెల్స్‌కే చెల్లించాల్సిన మొత్తం రూ. 199.42
ఇందులో ప్యాక్ ఖరీదు రూ.20లు 25 ఛానెల్స్‌కు వరకూ వర్తిస్తుంది. 25 దాటి ఒక్క పే ఛానెల్ ఎక్కువ తీసుకున్నా మరో రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు కేబుల్ టీవీలో ముఖ్యంగా హాత్‌వేలో ఇంతకు ముందు రూ.200 లేదా రూ.250లకు చూసిన ఛానెల్స్ అన్నీ కావాలంటే దాదాపు రూ. 1100 చెల్లించాల్సి ఉంటుంది.ఇందులో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌తో పాటు కొన్ని హిందీ ఛానెల్స్ చూడాలనుకుంటే రూ.310 ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందుతో పోలిస్తే 75 శాతం ఛానెల్స్ తక్కువ, ఖర్చు విషయంలో మాత్రం ఇది రూ.60 ఎక్కువ.
దీనికి కేబుల్ టీవీ ఆపరేటర్లు చెప్పే సమాధానం కూడా భిన్నంగా ఉంది. ఇంతకు ముందు జెమినీ, మా, జీ టీవీ వంటి పే ఛానెల్స్‌కు ఒక్కొంటికీ కేవలం రూ.4 చెల్లంచేవాళ్లమని, ఇప్పుడు వాళ్లు రూ.17 నుంచి రూ.19 దాకా వసూలు చేస్తూ ధరలు భారీగా పెంచేశారని వాపోతున్నారు.
కేబుల్ టీవీతో పోలిస్తే DTH సర్వీసులే కొంచెం బెటర్ ఆప్షన్.
Sun Direct: Telugu DPO Pack రూ.179.66 + 18 శాతం GST కలుపుకుని మొత్తం రూ. 211.33 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 191 ఛానెల్స్ చూసే సదుపాయం కల్పిస్తోంది సన్ డైరెక్ట్. Telugu DPO Pack2 కింద రూ. 230.5 + 18 శాతం GST కలుపుకుని మొత్తం రూ. 271.99 చెల్లిస్తే 210 ఛానెల్స్ చూడొచ్చు. కేబుల్ టీవీతో పోలిస్తే ఇందులో ఛానెల్స్ సంఖ్య ఎక్కువ, ఖర్చు తక్కువ.
Dish Tv: Classic Joy పేరుతో ఉన్న ప్యాక్‌లో 199 ఛానెల్స్‌ను రూ.180 లకే అందిస్తోంది డిష్ టీవీ. దీనికి 18 శాతం GST ఎక్స్‌ట్రా. అలాగే Classic Joy+ Telugu ప్యాక్ కింద 216 ఛానెల్స్ చూసేందుకు రూ. 243+ 18 శాతం ట్యాక్స్ కలిపి రూ.286.74 చెల్లించాల్సి ఉంటుంది.
TATA SKy: మిగిలిన వాటితో పోలిస్తే టాటాస్కై భిన్నమైన ప్యాక్స్‌ అందిస్తోంది. ఇందులో ఫ్రీ ఛానెల్స్ కాకుండా 20 తెలుగు ఛానెల్స్‌ కోసం రూ.136 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Airtel TV: ఎయిర్ టెల్ టీవీ ప్యాక్స్ రూ.240 (+18 శాతం GST) నుంచి రూ. 700 దాకా ఉన్నాయి. రూ.240 ప్యాక్‌లోనే 247 ఛానెల్స్ చూసే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ టెల్.

Post a Comment

0 Comments