ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన చాలా కార్యక్రమాలను.. మన నేటివిటికీ తగ్గట్టు వివిధ భాషల్లో ప్రోగ్రామ్స్‌ను వండి వారుస్తున్నారు. అదే కోవలో ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ను ముందుగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమై ఎంతో పాపులర్ అయింది. నార్త్‌లో పాపులర్ అయిన ఈ ప్రోగ్రామ్‌ను దక్షిణాదిలో ఆయా భాషల్లోని పాపులర్ నటుల హోస్ట్‌తో మంచి రేటింగే తెచ్చుకుంది. ఇక తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి పేరే తెచ్చుకున్నాడు. రెండో సీజన్‌కు మాత్రం నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కానీ నాని చేసిన బిగ్‌బాస్ 2 ప్రోగ్రాం ఎన్నో విమర్శలను మూట గట్టుకుంది. ఇక తమిళంలో ఈ బిగ్‌బాస్ ప్రోగ్రాంను యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే అక్కడ మూడో సీజన్ ప్రారంభమైంది. తెలుగులో మూడో సీజన్ కోసం స్టార్ మా ఎందరో హీరోలను కలిసి..చివరకు నాగార్జునను ఒప్పించింది. తాజాగా నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ 3 ప్రోమోను కూడా రిలీజ్ చేసారు.
Video link :-___https://youtu.be/Z_9snVma2Gs__
ఫ్రస్తుతం నాగార్జున,రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ మూవీకి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్‌లో నాగార్జున, కుర్ర భామలతో చేసిన లిప్‌లాక్ సీన్లు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండటంతో పాటు స్టార్ మా యాజమాన్యం రిక్వెస్ట్‌తో నాగార్జున..బిగ్ బాస్ 3 ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ..100రోజుల పాటు హౌస్‌లో ఉండబోతున్నట్టు చెప్పారు. అందుకోసం మార్కెట్ వెళ్లి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేవాళ్ల కోసం సరుకులు తీసుకెళుతున్నట్టు కొంచెం ఫన్నిగా పిక్చరైజ్ చేసారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 3లో హోస్ట్‌గా నాగార్జున ఎలా మెప్పిస్తాడనేది చూడాలి.

0 Comments