16 RAM 1TB ROM


10 జిబి ర్యామ్, 512జిబి స్టోరేజ్, ప్రపంచంలో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే !



చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రపంచ మొబైల్ మార్కెట్‌కి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌ చరిత్రలోనే తొలిసారిగా 10 జిబి ర్యామ్‌తో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఎక్స్‌ప్లే 7 పేరిట రానున్న ఈ ఫోన్లో అన్నీ ఫీచర్లు భారీగానే ఉండనున్నట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు, ఇమేజ్‌లు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. సోషల్ మీడియాలో లీకయిన వార్తల ప్రకారం వివో ఎక్స్‌ప్లే 7 స్మార్ట్‌ఫోన్‌లో 10జీబీ భారీ ర్యామ్‌తోపాటు 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నట్లు తెలుస్తున్నది.


Vivo Xplay 7
అలాగే ఈ ఫోన్‌లో ఫుల్ బెజెల్ లెస్ 4కే ఓలెడ్ డిస్‌ప్లే, 4ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇచ్చే కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ 256GB and 512GB వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. దీని ధర వివరాలపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ ఫోన్ 500 డాలర్లు ఉండే అవకాశం ఉందని అంచనా. మన కరెన్సీలో చెప్పాలంటే సుమార రూ. 31,800.

Post a Comment

0 Comments