ఓ నెంబర్‌కి కాల్ చేసి IVRS ద్వారా మీ mobile numberని ఆధార్‌తో రీ-వెరిఫై చేసుకోవచ్చు.




దేశంలోఉన్న ప్రతీ mobile number ఆధార్ కార్డుతో అనుసంధానం కావాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటి వరకూ ఈ ప్రక్రియ పూర్తి చెయ్యడానికి దగ్గరలో ఉన్న telecom outletలకు వెళ్లవలసి వచ్చేది. ఈరోజు నుండి ఆ అసౌకర్యం తొలగిపోయింది. కేవలం ఓ నెంబర్‌కి కాల్ చేసి IVRS ద్వారా మీ mobile numberని ఆధార్‌తో రీ-వెరిఫై చేసుకోవచ్చు.

దీని కోసం మీరు చెయ్యవలసిందల్లా మీ phone నుండి 14546కి కాల్ చేయాలి. అప్పుడు ఓ IVR వాయిస్ విన్పిస్తుంది. కాల్ కనెక్ట్ అవగానే మీకు కావలసిన భాషని ఎంచుకుని ఆదేశాలను వింటూ మీ ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేయాలి. మీరు ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేసిన వెంటనే Airtel, Idea, BSNL లాంటి టెలికం కంపెనీలు ఆ వివరాలను UIDAIకి వెరిఫికేషన్ కోసం పంపిస్తాయి.

వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు ఓ OTP వస్తుంది. ఆ OTPని కాల్‌లో ఉండగానే ఎంటర్ చేయాలి. OTP ఎంటర్ చేసిన వెంటనే కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. చివరగా మీకు ఓ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

దాంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.

Post a Comment

0 Comments