పీకలోతు అప్పుల్లో వున్న రెండు తెలుగు రాష్ట్రాలు రాబోయే రోజుల్లో కోట్లకు పడగలెత్తనున్నాయా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు. జియోఫిజిక్స్ పరిశోధకులు. మొత్తం 400 ఏళ్ల డేటాను విశ్లేషించిన నిపుణులు ఈ రెండు రాష్ట్రాలు 36 వజ్రాల జోన్స్ వున్నట్లు తేల్చేశారు.
తెలంగాణలోని మహబూబ్‌నగర్- కర్ణాటకలోని రాయిచూర్ సరిహద్దుల్లో 25 కొత్త వజ్రాల గనులుండే అవకాశముంది. అలాగే నల్గొండ జిల్లాలో 15 ఏరియాల్లో డైమండ్స్ గనులున్నట్లు ఓ అంచనా..! ఈ మొత్తం ఏరియా మూసి-కృష్ణా రివర్ బేసిన్ కావడం విశేషం.. కృష్ణానది పరివాహక ప్రాంతం భౌగోళిక పరిణామాల నేపథ్యంలో 5 కిలోమీటర్ల లోతున వజ్రాలు వుండవచ్చుని భావిస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఉస్మానియా యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. నారాయణపేట, యాదగిరి, కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, రాయిచూర్ తదితర చోట్ల వృత్తాకారంలో ఏర్పడ్డ పొరల్లో 500 మీటర్ల నుంచి 1200 మీటర్ల లోతున వజ్ర నిక్షేపాలు ఉండవచ్చని ఓ అంచనా..!
కృష్ణా బేసిన్ పశ్చిమ రాయిచూర్ నుంచి విజయవాడ వరకు వుంది. ఆ ప్రాంతంలో కచ్చితంగా డైమండ్స్ వుంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇక ఏపీలో పెన్నా బేసిన్ ప్రాంతంలోనూ డైమండ్ నిక్షేపాలున్నట్లు గతంలో అధికారులు వెల్లడించిన విషయం తెల్సిందే!

మరో ఏడాదిలో స్టడీ పూర్తికాగానే వజ్రాల గనులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అంటున్నారు. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల కష్టాలు తీరిపోయినట్టే..!
0 Comments