విమానంలో ఇఫ్తార్ కోసం నీళ్లు అడిగితే.. ఫుల్ మీల్స్ ఇచ్చారు





హైదరాబాద్ : రిఫాట్ జావిద్ అనే ఓ ముస్లిం ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఢిల్లీకి చెందిన ఈ విమానం గోరఖ్ పూర్ వెళ్తోంది. అందులోనూ రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉండటంతో ఇఫ్తార్ విందు కోసం ఆయన ఎయిర్ హోస్టెస్ ను కొంచెం నీళ్లు కావాలని అడిగాడు. ఈ క్రమంలో జావెద్.. విమానంలోని ఎయిర్ హోస్టెస్ ను నీళ్ల బాటిల్ ఒకటి అడిగాడు. ఆ తర్వాత మరో బాటిల్ అడిగాడు. అందుకు ఆమె.. తన సీటులోనే కూర్చొని మని చెప్పి వెళ్లింది. ఈసారి హోస్టెస్ వచ్చేటప్పుడు.. ఒక ట్రేపై మీల్.. రెండు సాండ్ విచ్ ఫుల్ ఫుడ్ తీసుకురావడంతో అతడు ఆశ్చర్యపోయాడు.
దయచేసి మరొకటి అడగకండి ప్లీజ్ అంటూ వెళ్లిపోయింది. అందుకు.. లేదు.. ఇంకా అవసరం లేదు. ఇది చాలు.. నాకు సరిపోతుందని అన్నాడు. దాంతో హోస్టెస్.. నవ్వుతూ వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించి జావెద్ తన ట్విట్టర్ లో ఇదే నా భారతదేశం.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఘటన ఎంతోమంది హృదయాలను కదిలించింది. సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిస్తూ.. భారతీయుల ఔన్నత్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Post a Comment

0 Comments