స్టార్ హీరోయిన్లు వారి చదువులు.. ఓ లుక్కేయండీ !

అందం, అభినయంతో పాటు మంచి చదువుని కూడా ఒంటబట్టించుకొన్నారు మన స్టార్ హీరోయిన్లు. హీరోయిన్ గా బిజీగా చదువుని కొనసాగించిన వారు ఉన్నారు. స్టార్ హీరోయిన్లు వారి చదువులపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

స్టార్ హీరోయిన్ నయనతార మార్థోమా కళాశాలలో బీఏ పూర్తి చేశారు. 2003లో ఓ మలయాళ చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. తెలుగులో ఆమె మొదటి సినిమా వెంకటేశ్‌ నటించిన ‘లక్ష్మీ’. స్వీటీ #అనుష్క కార్మెల్‌ కళాశాలలో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఆమె యోగా శిక్షకురాలు కూడా. యోగా గురువు భారత్‌ ఠాకూర్‌ దగ్గర ఆమె శిక్షణ తీసుకున్నారు. తర్వాత అనుకోకుండా 2005లో నాగార్జున-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సూపర్‌’ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది.

#సమంత చెన్నైలోని స్టెల్లా మారిస్‌ కాలేజీలో కామర్స్‌ పూర్తి చేశారు. 2010లో నాగచైతన్య సరసన ‘ఏ మాయ చేసావె’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. తమన్నా ముంబయిలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ స్కూల్‌లో చదివారు. ఆర్ట్స్‌లో పట్టా పొందారు. ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ చిత్రంతో 2005లో నటిగా పరిచయం అయ్యారు.

#త్రిష చెన్నైలోని మహిళా కళాశాలలో బీబీఏ చదివారు. 1999లో వచ్చిన ‘జోడీ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది త్రిష. కాజల్.. కేసీ కళాశాలలో మాస్‌ మీడియాలో మార్కెటింగ్‌ విభాగంలో పట్టా పొందారు. 2004లో ‘క్యూ హో గయా నా..’ అనే హిందీ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ సోదరి పాత్రలో నటించారు. శృతిహాసన్ ముంబయిలోని కాలేజీలో సైకాలజీ చదివారు. 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

#రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆమె దిల్లీలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివారు. జీసస్‌ అండ్‌ మేరీ కాలేజీ, దిల్లీ యూనివర్శిటీలో గణితం అభ్యసించారు. 2009లో ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు.

Post a Comment

0 Comments