ఇండియా టుడే సర్వేలో జగనే ముందు...చంద్రబాబు ప్లేస్ ఏంటో తెలుసా ?

ప్రముఖులు ట్విట్టర్ ఖాతాలో ఏదేనా అంశంపై ట్వీట్ చేసినపుడు ఎంతమంది ఫాలో అవుతున్నారు ? ఎంతమంది రీ ట్వీట్ చేస్తున్నారు ? అన్న విషయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎంతమంది తమను ఫాలో అవుతున్నారంటే సదరు ప్రముఖులకు అంత గొప్ప.

ఇంతకీ విషయం ఏమిటంటే, దేశం మొత్తం మీద ట్విట్టర్ ఖాతాలో ఫాలోయర్లున్న అత్యంత ప్రజాధరణ కలిగున్న రాజకీయ నేతల్లో జగన్మోహన్ రెడ్డి మూడో స్ధానంలో ఉన్నారు. ఆశ్చర్యమేమిటంటే మొదటిస్ధానంలో రాహూల్ గాంధి ఉండటం. ప్రధానమంత్రి నరేంద్రమోడి రెండో స్ధానంలో ఉన్నారు. ఇండియా టు డే నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో ప్రజాధరణ ఉన్న 12 మంది రాజకీయ నేతల ఫాలోయింగ్ ఎంతో బయటపడింది.

10 వేల రీ ట్వీట్లను బెంచ్ మార్కుగా పెట్టుకుంటే రాహూల్ ట్వీట్ ను 8094 మంది ఫాలోయర్లు రీ ట్వీట్లు చేస్తున్నారట. నరేంద్రమోడి ట్వీట్ ను 4884 మంది రీ ట్వీట్ చేస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ను 1623 మంది రీ ట్వీట్ చేస్తుండగా చంద్రబాబు ట్వీట్ ను 307 మంది మాత్రమే రీ ట్వీట్ చేస్తున్నారట. 12 మంది జాబితాలో చంద్రబాబు 8వ స్ధానంలో ఉన్నారు. అందరికన్నా తక్కువగా ఓడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ 52 రీ ట్వీట్లతో చివరి స్ధానంలో నిలిచారు.

Post a Comment

0 Comments