షావోమి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త..!
కంపెనీ ఇటీవలనే పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌లో గేమ్ టర్బో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే రెడ్‌మి కే20 ప్రో ఫోన్‌లో కూడా గేమ్ టర్బో 2.0 ఫీచర్ ఉంది.
హైలైట్స్
రెడ్‌మి నోట్ 7 ప్రో ఫోన్‌లో కొత్త అప్‌డేట్
దీని ద్వారా ఫోన్‌కి గేమ్ టర్బో మోడ్ ఫీచర్ జోడింపు
ప్రస్తుతం చైనా యూజర్లకు ఈ సౌలభ్యం అందుబాటులో
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి తాజాగా తన యూజర్లకు తీపికబురు అందించింది. షావోమి రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌లో గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరిచాలని కంపెనీ భావిస్తోంది.
షావోమి ఈ నేపథ్యంలోనే రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లకు గేమ్ టర్బో మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమౌతోంది. ఎంఐయూఐ అప్‌డేట్ రూపంలో ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జూన్ 18 నుంచే ప్రారంభమైంది. అయితే చైనా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇతర మార్కెట్లలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
కంపెనీ ఇటీవలనే పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌లో గేమ్ టర్బో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే రెడ్‌మి కే20 ప్రో ఫోన్‌లో కూడా గేమ్ టర్బో 2.0 ఫీచర్ ఉంది.
Keywords:
#Xiaomi#Redmi Note 7 Pro#Redmi K20 Pro#poco f1#miui update#game turbo mode
0 Comments