WhatsApp Fingerprint Authentication Feature | గతంలో ఐఓఎస్ యూజర్లకు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్... ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది. లేటెస్ట్ బీటా వర్షన్‌లో ఈ ఫీచర్ కనిపిస్తోంది. ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్‌తో పాటు డార్క్ మోడ్ కూడా కనిపించింది. గతంలో ఐఓఎస్ యూజర్లకు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్... ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ బీటా యూజర్లు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌కు సంబంధించిన ఫోటోలను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. త్వరలో మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ అయితే మీరు కూడా ఈ కొత్త ఫీచర్ వాడుకోవచ్చు
ఎలా సెట్ చేసుకోవాలి?
మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి
Settings ఓపెన్ చేసి Account క్లిక్ చేయండి.
Privacy ఆప్షన్‌లో మీకు Use Fingerprint to Unlock క్లిక్ చేసి ఫింగర్‌ప్రింట్ రిజిస్టర్ చేసుకోవాలి.
అందులో 1 minute, 10 minutes, 30 minutes అని టైమ్ ఔట్ ఆప్షన్ ఉంటుంది.
0 Comments